Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 October 2024, 7:17 pm Posted by : ramakrishna

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

  • రైతుల డిమాండ్
  •  వర్షానికి తడిసిన ధాన్యం 

బతుకమ్మ పిట్లం : వర్షాలు కురుస్తున్న వరి ధాన్య కొనుగోలు కేంద్రం ప్రారంభించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.పిట్లం మండల కేంద్రంలోని జోరుగా వర్షం కురిసింది. మండలంలోని వ్యవసాయ మార్కెట్ లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ప్రస్తుతం వరి కోత దశకు రావడంతో కురుస్తున్న వర్షంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఉదయం నుంచి ఎండగా ఉండడంతో పోసిన వరి ధాన్యాన్ని రైతులు ఆరబోశారు ఒక్కసారిగా వర్షం కురవడంతో ఆరబోసిన వరి ధాన్యం వరదనీటిలో కలిసిపోయింది. పలు గ్రామాల్లో వరి పంట నేల కోరింది ధాన్యం చేతికి వచ్చిన సమయంలో వర్షం కురుస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే కొనుగోలు కేంద్రాలను తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.