Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 October 2025, 4:24 pm Posted by : ramakrishna

ఫ్యాక్స్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ఎల్లారెడ్డిపేట బతుకమ్మ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తిమ్మాపూర్ సోసైటీ ఆధ్వర్యంలో తిమ్మాపూర్, గొల్లపల్లి, గుండారం గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తిమ్మాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ బుగ్గ కృష్ణమూర్తి, బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ సబేరా బేగం ల చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని తరలించి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర గ్రేడ్ A- 2389/-, గ్రేడ్ – B 2369/- ధరలను రైతుల పొందాలని సూచించారు.. రైతులు ఎవరు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం కల్పించే గిట్టుబాటు ధరను పొందాలని ఈ సందర్భంగా వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘ డైరెక్టర్లు పెంజర్ల నారాయణ ,అందే గంగవ్వ, గుర్రాల సత్తిరెడ్డి,మనవేణి లక్ష్మణ్, గుగులోత్ నరహరి, ఏఎంసి వైస్ చైర్మన్ గుండాడి రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, చేపూరి రాజేశం , తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ పడగల రవీందర్, ఏఎంసి డైరెక్టర్ లు సూడిది రాజేందర్ ,మెండే శ్రీనివాస్,సంఘ సెక్రటరీ కొండ శశివర్ధన్ గౌడ్, సేంటర్ ఇన్చార్జులు , రైతులు తదితరులు పాల్గొన్నారు.