కెనడాలో పంజాబ్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ అరెస్ట్
వెబ్ డెస్క్, బతుకమ్మ : పంజాబ్‌లో పలు నేరాలకు సంబంధించిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ అమృత్‌పాల్ సింగ్ (హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ అమృత్‌పాల్ బాత్)ను కెనడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై సుమారు 20 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అతడిని భారత్‌కు తీసుకొచ్చేందుకు పంజాబ్ పోలీసులు అవసరమైన చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించారు. తరన్‌తారన్ జిల్లా ఎస్పీ సురేంద్ర లాంబా ఈ విషయాన్ని తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారంతో ఇప్పటికే అతడిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. కెనడా...