Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 7:31 pm Posted by : ramakrishna

పంజాబ్ & సింధ్ బ్యాంక్ నూతన శాఖ ప్రారంభం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్, కే.సి.ఆర్ కాలనీ రోడ్ సమీపంలో కొత్తగా ప్రారంభమైన పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ శాఖను నిజామాబాద్ మేయర్ ఉమారాణి రమేష్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంక్ ప్రతినిధులు మేయర్ ని హర్షాతిరేకంగా స్వాగతించి, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. స్థానిక ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడానికి ఈ కొత్త శాఖ ఎంతో ఉపయోగకరంగా ఉండనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, బ్యాంక్ సిబ్బంది, ప్రజలు పాల్గొని ఈ ప్రారంభోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు.