Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 October 2024, 11:55 am Posted by : ramakrishna

సమయపాలన పాటించని అంగన్వాడీ టీచర్….

– అంగన్వాడి కేంద్రలపై పర్యవేక్షణ కరువు…..

రుద్రూర్, బతుకమ్మ:

రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామంలో గల అంగన్వాడీ సెంటర్ లో అంగన్వాడీ టీచర్ సమయపాలన పాటించడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీచర్ ఉండాల్సి ఉండగా, వారు సమయానికి రాకుండా ఇష్టానుసారంగా వస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాగైతే అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు చదువులు ఎలా కొనసాగుతాయని స్థానిక ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. ఈ విషయమై శనివారం రోజున బతుకమ్మ న్యూస్ రిపోర్టర్ ఉదయం సుమారు 10:00 ప్రాంతంలో అంగన్వాడీ సెంటర్ కు వెళ్లి చూస్తే పిల్లలు వచ్చి కూర్చున్నాక కూడా టీచర్ రాక అంగన్వాడి కేంద్రంలో పనిచేస్తున్న ఆయా అన్ని చూసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా అధికారులు, సూపర్ వైజర్ అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Punctual Anganwadi Teacher...