సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో పులిహోర వితరణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఆయా సమస్యలపై అర్జీలు సమర్పించేందుకు ప్రజావాణి కార్యక్రమానికి తరలివచ్చే వారి కోసం సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో పులిహోర వితరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా పులిహోర పంపిణీ చేశారు. వేసవి ఎండలు తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో, ప్రజావాణి కార్యక్రమానికి ప్రతి సోమవారం సుదూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజల కోసం పులిహోర పంపిణీ కార్యక్రమం చేపట్టామని, ప్రతి సోమవారం దీనిని...