Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 5:43 pm Posted by : ramakrishna

సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో పులిహోర వితరణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఆయా సమస్యలపై అర్జీలు సమర్పించేందుకు ప్రజావాణి కార్యక్రమానికి తరలివచ్చే వారి కోసం సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో పులిహోర వితరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా పులిహోర పంపిణీ చేశారు. వేసవి ఎండలు తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో, ప్రజావాణి కార్యక్రమానికి ప్రతి సోమవారం సుదూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజల కోసం పులిహోర పంపిణీ కార్యక్రమం చేపట్టామని, ప్రతి సోమవారం దీనిని కొనసాగిస్తామని సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ ప్రతినిధులు తెలిపారు. కాగా, రాజస్థానీ వాకర్స్ గ్రూప్ సౌజన్యంతో చల్లటి తాగునీటిని సమకూర్చారు. ఫోరం ప్రతినిధులను, వాకర్స్ గ్రూప్ బాధ్యులను అదనపు కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, సీనియర్ సిటిజన్స్ ఫోరం, వాకర్స్ గ్రూప్ ప్రతినిధులు పాల్గొన్నారు.

 

Pulihora distribution under the auspices of Senior Citizens Forum