భీమ్ గల్ ఎంపీడీఓ లో ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లికేషన్
బతుకమ్మ, భీమ్ గల్ : జిల్లా ఎన్నికల అధికారి ఆదేశానుసారం భీమ్ గల్ ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ఎంపీడీఓ సంతోష్ కుమార్ ఫైనల్ ఓటర్ లిస్టును నోటీసు బోర్డు పై అతికించి ప్రచురించారు. గ్రామ పంచాయతీ రెండవ సాధారణ ఎన్నికల భాగంగా మండలంలోని 27 గ్రామ పంచాయతీల ఫైనల్ ఓటర్ లిస్ట్ ను ఎంపీడీఓ ఆఫీస్ లో, ఆయా గ్రామపంచాయతీ ఆఫీస్ ల్లో నోటీసు బోర్డు పై అతికించి ప్రచురించారు. ఈ కార్యక్రమం లో ఎంపిడీఓ, ఆయా గ్రామాల సెక్రటరీలు పాల్గొన్నారు.