- అది చూసి ఓర్వలేక ప్రశాంత్ రెడ్డి అబద్ధపు మాటలు
- రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి
భీంగల్, బతుకమ్మ : పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజల మద్దతు చూసి ఓర్వలేక ప్రశాంత్ రెడ్డి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి భీమ్గల్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మొదలైనప్పటి నుండి స్థానిక శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి తమకు గ్రామాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేకపోవడంతో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం పై అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాడని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చీరల పంపిణీ, వడ్డీ లేని రుణాలు ఇస్తున్న సందర్భంలో ఇప్పటికే అయోమయంలో ఉన్న ప్రశాంత్ రెడ్డి అవి కేవలం ఎన్నికల కోసమే ఇస్తున్నారని అబద్దపు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. గతంలో మంత్రిగా చేసిన ప్రశాంత్ రెడ్డికి ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడని అన్నారు. గతంలో 9 సంవత్సరాలు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణాలకు వడ్డీ మాఫీ చేయలేదని, మాఫీ చేయాలనే ఆలోచన కూడా వారికి రాలేదని అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కోటి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తుంటే కేవలం ఎన్నికల కోసమే ఇస్తున్నారని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత మూడు నెలల క్రితం కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగిందని అప్పుడు ఎన్నికలు లేవని,మేము ఎప్పుడు ఇస్తున్నాము కాదు మీరు 9 సంవత్సరాల లో ఎందుకు రుణాలు మాఫీ చేయలేదు ఒక్కసారి ఆత్మ శుద్ధి చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భీంగల్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు జేజేనర్సయ్య, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, గోపాల్ నాయక్, అన్వేష్, వక మహేష్, దొంకంటి రాజేష్, నాగభూషణం, శ్యామ్ రాజ్, సాయి బాబా, నవీన్, పల్లికొండ అశోక్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.