మోర్తాడ్, బతుకమ్మ: అనునిత్యం పేద ప్రజలకు సేవ చేస్తూ ప్రజాసేవకుడిగా పేదల గుండెల్లో నిలిచిన మంచి వ్యక్తి నిజామాబాద్ జిల్లా తొలి మేయర్ ధర్మపురి సంజయ్ అని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గిర్మాజీ గోపి అన్నారు. ధర్మపురి సంజయ్ జన్మదిన సందర్భంగా శనివారం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో గంగాధర్, యాటమ్ విజయ్, దడివి గౌతమ్, మోతే సుభాష్, అశోక్, సుభాష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.