ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలి

జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్     కామారెడ్డి, బతుకమ్మ : ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యత నివ్వాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి వారి సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యల పరిష్కారానికి 69 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికార యంత్రాంగం పై విశ్వాసంతో   ప్రజావాణి కార్యక్రమం ద్వారా తమ సమస్యలు పరిష్కారమవుతాయని...