Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 August 2025, 4:27 pm Posted by : ramakrishna

ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలి

  • జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్  

 

కామారెడ్డి, బతుకమ్మ : ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యత నివ్వాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి వారి సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యల పరిష్కారానికి 69 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికార యంత్రాంగం పై విశ్వాసంతో   ప్రజావాణి కార్యక్రమం ద్వారా తమ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు  ఎంతో విశ్వాసంతో వారి సమస్యల పరిష్కారానికి  దరఖాస్తులను అందజేస్తారని వాటిని ప్రతి ఒక్క శాఖ అధికారి  ప్రత్యేకంగా పరిశీలించి సమస్య పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకొని రిపోర్ట్ ను కలెక్టరేట్ లో అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్, కలెక్టరేట్ ఏఓ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Public petitions should be given priority