Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 November 2025, 6:51 pm Posted by : ramakrishna

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్భార్

 

. .  ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

జుక్కల్, బతుకమ్మ :

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తెలిపారు. జుక్కల్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ప్రజా దర్భార్ కార్యక్రమాన్ని  జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నిర్వహించారు. సమస్యలతో వచ్చిన ప్రజల దగ్గర నుండి అర్జీలు స్వీకరించి వారి యొక్క సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించడం జరిగింది.. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నియోజకవర్గంలో ప్రజలు వివిధ సమస్యలతో  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేసి వారి సమస్యలను తెలుసుకొని తక్షణమే పరిష్కారం చేసే దిశగా కృషి చేస్తున్నామన్నారు. అదేవిధంగా జుక్కల్ మండలానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.ఈ ఈ కార్యక్రమంలో రమేష్ దేశాయ్, మద్నూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయి గౌడు, జుక్కల్ మాజీ సర్పంచ్ బొంపెల్లి రాములు జుక్కల్ సొసైటీ చైర్మన్ శివానంద్ పటేల్, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు సతీష్ పటేల్, బిచ్కుంద సొసైటీ చైర్మన్ నాగరాజ్ పటేల్ తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Public Court is for solving public problems