ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనివ్వాలి
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, రెండుపడక గదుల ఇళ్లు మంజూరు, రైతు భరోసా, ఫించన్లు మంజూరు తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి. ఈ రోజు ప్రజావాణి లో (76) ఫిర్యాదులు పలు శాఖలకు చెందినవి అందాయని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి లో...