Date of Publish : 14 October 2024, 3:58 pmPosted by : ramakrishna
ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్
ప్రజావాణికి 51 ఫిర్యాదులు
నిజామాబాద్ సిటీ బతుకమ్మ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 51 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కమిషనర్ మకరంద్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.