Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 December 2025, 4:29 pm Posted by : ramakrishna

నేడు వాహనాల బహిరంగ వేలం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ​ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ నిజామాబాద్ లో స్వాధీనం చేసుకున్న వాహనాలకు బహిరంగ వేలం మంగళవారం నిర్వహించనున్నట్లు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నగరంలోని సుభాష్ నగర్ లో గల ప్రొహిబిషన్ ఎక్సైజ్ కార్యాలయంలో ఉదయం 10గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేలంలో పాల్గొనేవారు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలకు లోబడి, ఆయా వాహనాలకు నిర్ణయించిన కనీస ధర కంటే ఎక్కువ ధరను పాడవలసి ఉంటుందని  తెలిపారు. వేలం పూర్తయిన వెంటనే, అత్యధిక ధర పాడుకున్న వారు వేలం మొత్తాన్ని నగదు  రూపంలో వెంటనే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ​ఆసక్తి గల వ్యాపారులు, వ్యక్తులు, ప్రజలు ఈ బహిరంగ వేలంలో పాల్గొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.