Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 December 2024, 4:12 pm Posted by : ramakrishna

ఎక్సైజ్ కేసులలో పట్టుబడిన ద్విచక్ర వాహనాల బహిరంగ వేలం

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఈనెల 11న వివిధ ఎక్సైజ్  కేసులలో పట్టుబడిన ద్వి చక్రవాహనాలను బహిరంగంగా వేలం వేస్తున్నట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఇన్స్ పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేలం పాటను నరగరంలోని బోర్గాం(పి)లో గల ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు ఈఎండీ చెల్లించి బహిరంగ వేలంలో పాల్గొనాలని తెలిపారు. బహిరంగ వేలం బుధవారం ఉదయం 10గంటలకు జిల్లా ప్రొహిబిషన్,  ఎక్సైజ్ అధికారి డి.చంద్రబాన్ నాయక్ సమక్షంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. వాహనాల వివరాలు కావలసిన వారు బోర్గాం(పి)లోని ఎక్సైజ్ కార్యాలయాన్ని సందర్శంచాలని తెలిపారు.