ఆలయ భూముల కౌలు లీజు బహిరంగ వేలం
బతుకమ్మ, బోధన్: శ్రీ చక్రేశ్వర శివ మందిరం యొక్క పాండు తర్ఫ లో గల ఎకరం 1-35 గుంటల సాగు భూములు రెండు సంవత్సరాల కాల పరిమితికి బహిరంగ వేలం ద్వారా కౌలు లీజుకు ఇస్తున్నట్లు శ్రీ ఏక చక్రేశ్వర శివ మందిరం కార్యనిర్వహణ అధికారి, అభివృద్ధి కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 26న చక్రేశ్వర శివ మందిర కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు ముందుగా రూ.2వేలు డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని తెలిపారు.