ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
మోర్తాడ్, బతుకమ్మ : తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మోర్తాడ్ గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో తిరుమల మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలం వల్ల రాచరికపు పాలన నుంచి విముక్తి పొందినామని అన్నారు. భారత యూనియన్‌లో తెలంగాణ విలీనమైన శుభదినాన్ని “ప్రజా పాలన దినోత్సవం” నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తిరుమల, పంచాయతీ కార్యదర్శి సైఫుద్దీన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు....