Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 September 2025, 5:49 pm Posted by : ramakrishna

ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

మోర్తాడ్, బతుకమ్మ : తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మోర్తాడ్ గ్రామపంచాయతీ కార్యాలయంలో  జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో తిరుమల మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలం వల్ల రాచరికపు పాలన నుంచి విముక్తి పొందినామని అన్నారు. భారత యూనియన్‌లో తెలంగాణ విలీనమైన శుభదినాన్ని “ప్రజా పాలన దినోత్సవం” నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తిరుమల, పంచాయతీ కార్యదర్శి సైఫుద్దీన్  శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష, వారి ఆలోచన అని అన్నారు. ఇది నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి అని పేర్కొన్నారు. తెలంగాణ అంటే త్యాగం, ఆనాటి సాయుధ పోరాటంలో అమరులైన వీరులకు ఈ సందర్భంగా  ఘన నివాళి అర్పించారు.  కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆశ వర్కర్ గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.