తెయూలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ విశ్వ విద్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పరిపాలనా భవనం ముందు  తెలంగాణ యూనివర్సిటీ  వైస్ -ఛాన్స్లర్ ప్రొఫెసర్. టి. యాదగిరిరావు రిజిస్ట్రార్ ప్రో.ఎం.యాదగిరి తో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం వైస్ -ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు మాట్లాడుతూ తెలంగాణా చరిత్రను మరో మలుపు తిప్పిన రోజు ఇదని శతాబ్దాల బానిస సంకెళ్లను తుంచేసిన ఉద్విగ్న సందర్భమన్నారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడాది అయినా  స్వేచ్ఛ...