Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 September 2024, 5:14 pm Posted by : ramakrishna

టిఎన్ జిఓ భవన్ లో ప్రజాపాలన దినోత్సవం

 బతుకమ్మ, నిజామాబాద్ సిటి: 

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా.. టిఎన్జీవో భవన్ నందు, ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు  అలుక కిషన్  జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్బంగా అలుక కిషన్ మాట్లాడుతు.. తెలంగాణ విముక్తి కోసం పాటు పడిన త్యాగదనులను స్మరించుకుని,అనంతరం తెలంగాణ విమోచన, ప్రజా పాలన దినోత్సవం ను గుర్తు చేశారు. ఈ  కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ , సహాధ్యక్షులు చిట్టి నారాయణరెడ్డి , టిఎన్జీవో కేంద్ర బాధ్యులు పోల శ్రీనివాస్, మచ్చకూరి సతీష్, జిల్లా కార్యవర్గ సభ్యులు గోవర్ధన స్వామి, వసుమతి దేవి, నటరాజ్ గౌడ్, దినేష్ బాబు, ఉమ కిరణ్, గురుచరణ్, క్లాస్ ఫోర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గోండ స్వామి, జగదీశ్వర్ హనుమాన్ దాస్ వివిద శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

Public Administration Day at TNGO Bhavan