జుక్కల్, బతుకమ్మ: జుక్కల్ మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో అధికారులు హాజరు కాలేదు. అధికారులేక ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. జుక్కల్ మండలంలోని అన్ని అధికారులు హాజరు కావాల్సింది ఉండగా ప్రస్తుతం ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో రాము, ఎమ్మార్వో మారుతీ, వ్యవసాయ అధికారి, ఐకెపి సిబ్బంది మాత్రమే హాజరయ్యారు. ప్రజల యొక్క సమస్యలు ఎవరికి చెప్పాలని వారు చెప్తున్నారు. దీని గురించి పట్టించుకునే అధికారులు లేరని రైతులు తెలిపారు.