- పీఆర్టీయూ నాయకత్వానికి బీసీలు అర్హులు కారా..?
- పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడి పోస్ట్ ఖాళీగా ఉండగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోనా?
- బీసీలకు పదవి దక్కుతుందనే భర్తీ చేయడం లేదా..?
- ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్లుగా పనికొచ్చేవారు లీడర్లుగా పనికి రారా..?
- రెండు నియోజకవర్గాలలో పీఆర్టీయూలో సమన్వయం కరువు
- టీచర్ ఎమ్మెల్సీ వేళ పీఆర్ఠీయూలోని బిసీ వర్గాల్లో జోరుగా చర్చ
నిజామాబాద్, బతుకమ్మ : ప్రోగ్రేసివ్రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ ( పిఆర్ టియు టిఎస్) లో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కలకలం మొదలైంది. నల్గొండ, కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు పిఆర్ టియూ బరిలో నిలిచిన వేళ బడుగు బలహిన వర్గాలకు చెందిన టీచర్లలో కోత్త చర్చ జరుగుతుంది. అందుకు కారణం ఎమ్మెల్సీ ఎన్నికలే. ఇప్పటి వరకు అత్యధిక సార్లు పిఆర్టీయూ అభ్యర్థులు ఎమ్మెల్సీలుగా గెలిచి చట్టసభలలో అడుగుపెట్టారు. మరోసారి ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో రెండు నియోజకవర్గాలలో టీచర్ ఎమ్మెల్సీ పదవులను దక్కించుకునేందుకు పిఆర్ టియు తీవ్రంగా కసరత్తు చేస్తుంది. అయితే రాష్ట్ర అధ్యక్షుడు లేకుండా రెండు స్థానాలలో గెలవడం ఎలా అనే చర్చ మొదలైంది. అందుకు కారణం లేకపోలేదు. గత ఏడాది డిసెంబర్ వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పింగళి శ్రీపాల్ రెడ్డి తన పధవికి రాజీనామా చేసి నల్గొండ నియోజకవర్గం నుంచి పిఆర్టియు ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. దాదాపు 50 రోజులుగా రాష్ట్ర అధ్యక్ష పధవి ఖాళీగా ఉంది. ఇప్పుడు ఇదే అంశం పిఆర్ టియులో రచ్చ రచ్చ చేస్తుంది. ఎందుకంటే రెండు స్థానాలలో బరిలో నిలిచిన యూనియన్ కు ఇప్పుడు నాయకత్వ లేమి స్పష్టంగా కనబడుతుంది. పిఆర్ టియు అభ్యర్ధులు మినహా దాని నాయకత్వం ప్రచారం లో లేకపోవడంతో ఇతర అభ్యర్ధులకు కలిసి వచ్చేలా ఉంది.
పిఆర్ టియు చరిత్రలో రాష్ట్ర అధ్యక్ష పదవి ఇప్పటి వరకు బడుగు బలహీన వర్గాలకు దక్కలేదు. గతంలో ఎమ్మెల్సీగా పని చేసిన పూలరవీంధర్ ఒక్కరే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని అలంకరించారు. జిల్లా, మండల కార్యవర్గాల్లో అడపాదడపా అధ్యక్ష పదవులను బీసీలు పొందినప్పటికీ రాష్ట్ర నాయకత్వానికి వచ్చే సరికి అగ్రవర్ణాలకే పరిమితమైంది. ప్రస్తుత తాజామాజీ అధ్యక్షుడు పింగళి శ్రీపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన తర్వాత బీసీలకు ఆ పదవి వస్తుందని చర్చ జరుగుతుంది. అందుకు కారణం లేకపోలేదు. మొన్నటికి మొన్న రాష్ట్ర కార్యదర్శి పదవిని నిర్వర్తించిన బీరెల్లి కమలాకర్ రావు పదవి విరమణకు ఒక రోజు ముందే ఒకరిని కార్యదర్శిగా నియమించారు. తర్వాత ఎన్నికలు నిర్వహించి కామారెడ్డి జిల్లాకు చెందిన దామోదర్ రెడ్డిని సెక్రటరిగా ఎన్నుకున్నారు. అయితే 50 రోజులుగా అధ్యక్ష పదవికి ఖాళీగా ఉండగా ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్లడంపై పీఆర్ టీయూలో ఉన్న బడుగు, బలహీన వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సురేష్, నల్గొండ జిల్లా అధ్యక్షులు బిక్షం గౌడ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రామేశ్వర్ గౌడ్ లు పదవి అందుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ బీసీలని ఒకే కారణం చేత ఆ పోస్టును భర్తీ చేయడం లేదని పీఆర్ టీయూలో ఉన్న బీసీల్లో చర్చ జరుగుతుంది.
శాసనమండలి ఎన్నికల కోలాహలం జరుగుతుంది. తెలంగాణలోని రెండు నియోజకవర్గాలైన కరీంనగర్, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే నామినేషన్ల దాఖలు ఉపసంహరణ పూర్తి కాగా ప్రచారం జోరందుకుంది. కానీ రాష్ట్రంలో అధ్యక్షుని పోస్టు ఖాళీగా ఉంచి ఎన్నికలకు వెళ్లడం వల్ల నాయకత్వ లేమి కనబడుతుంది. ఇదిలా ఉండగా బీసీ నాయకుడు అయిన పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సురేష్ ఎన్నికల బరిలో నిలిచేందుకు నామినేషన్ దాఖలు చేసినప్పటికీ అతని చేత సాంకేతికంగా నామినేషన్ విత్ డ్రా చేయించడంలో పీఆర్ టీయూలోని అగ్రవర్ణాలు కలిసి పని చేశాయని చర్చ జరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తిని వదిలిన మహేంధర్ రెడ్డికి అర్హత లేకపోయినా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారని బీసీలకు మాత్రం అన్యాయం చేశారని చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు పీఆర్ టీయూ నుంచి ఎన్నికల బరిలో నిలువాలంటే రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులతో పాటు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులకు మాత్రమే అర్హతగా పరిగణించారు. పీఆర్ టీయూలో అలాంటి అర్హత లేని మహేంధర్ రెడ్డికి టికెట్ ను కేటాయించడం వెనుక రాష్ట్ర నాయకత్వం కేవలం అగ్రవర్ణాలకే పెద్దపీట వేస్తుందనడానికి, వ్యాపార వేత్తలకు అవకాశాలు కల్పించిందని బీసీ టీచర్లలో అసంత`ప్తిని వెళ్లగక్కుతున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద ఉపాధ్యాయ సంఘం గా పేరన్నప్పటికీ బడుగు, బలహీన వర్గాల వారు నాయకత్వానికి పనికిరారా అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ శ్రీపాల్ రెడ్డి ఓడిపోతే తిరిగి ఆయనకే రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టేందుకే ఆ పోస్టును భర్తీ చేస్తలేరనే చర్చ మొదలైంది.