వేల్పూర్, బతుకమ్మ : మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్ర ఆవరణలో పిఆర్టియు టీఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న హైదరాబాదులో జరగనున్న సిపిఎస్ రద్దు మహాధర్నా కై ముద్రించిన పోస్టర్ లను పిఆర్టియు టీఎస్ వేల్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.ఈ సందర్బంగా పీఆర్టియు టీఎస్ వేల్పూర్ మండల శాఖ అధ్యక్షులు శ్రీ బోడ దేవానందం,ప్రధాన కార్యదర్శి సి.వి. నరసింహారావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పెంట జలంధర్,టీ. హరి చరణ్,పతాని గంగాధర్, విజయ్ కుమార్ మాట్లాడుతూ జీవితాంతం 30 సంవత్సరాల కు పైగా ఉద్యోగం చేసినప్పటికీ పెన్షన్ వర్తించకపోవడం దురదృష్టకరమని, షేర్ మార్కెట్ లో పెట్టే డబ్బుల వల్ల పెన్షన్ రాదని, షేర్ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల రిటైర్మెంట్ తర్వాత వారి జీవితం రోడ్డున పడే పరిస్థితి రావచ్చని అటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని కోరారు. రాష్ట్ర పిఆర్టియు టీఎస్ నాయకత్వం, ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి లు సెప్టెంబర్ 1న హైదరాబాదులో తలపెట్టిన CPS రద్దు కొరకై మహా ధర్నా కార్యక్రమానికి మండలంలో పనిచేసే ఉద్యోగ, ఉపాధ్యాయులంతా పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సిపిఎస్ అంతం – పిఆర్టియు పంతమని, సిపిఎస్ వద్దురా! ఓపీఎస్ ముద్దు రా!, జై పి ఆర్ టి యు…జై జై పి ఆర్ టి యు అని నినాదాలను హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వేల్పూరు మండల విద్యాశాఖ అధికారిణి రేణుక గారు మరియు వేల్పూర్ మండలంలోని కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, మల్లీశ్వరి, కే రాజన్న, పిఆర్టియుటిఎస్ నాయకులు మండల కార్యదర్శి రాకేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సురేష్, జిల్లా కార్యదర్శి నంబి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు,జి రవీందర్, చంద్ర దేవ్, దత్త ప్రసాద్, ఉపాధ్యక్షుడు రాజేందర్ గౌడ్, ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయులు హరిప్రసాద్,నరేందర్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు నాగేంద్ర, స్రవంతి,తేజస్విని, తదితరులు పాల్గొన్నారు.