- అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కనకపురం రవీందర్, నీరగొండ బుచ్చన్న
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: పిఆర్ టియు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ,రాష్ట్ర అధ్యక్షులు గార్లపాటి ఉమాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షులుగా కృపాల్ సింగ్ ను, జిల్లా అధ్యక్షులు గా కనకపురం రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గా నీరగొండ బుచ్చన్నలను ఎన్నుకున్నారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గా పొట్లూరి నాగేశ్వర్రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గా శ్రీకాంత్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.