Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 August 2024, 6:00 pm Posted by : ramakrishna

పీ ఆర్ టి యు మోర్తాడ్ మండల నూతన కార్యవర్గం ఎన్నిక

బతుకమ్మ, మోర్తాడ్ :  పీ ఆర్ టీ యు టీ ఎస్ మోర్తాడ్ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం ఎంపీడీవో కార్యాలయంలో మోర్తాడ్ మండల సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో 2024 -26 కు సంబంధించిన పిఆర్టియుటీయస్ మోర్తాడ్ మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షులు మగ్గిడ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి ప్రగతి కుమార్,  అసోసియేట్ అధ్యక్షులు రవి,
మహిళ ఉపాధ్యక్షురాలు ఏ. మాణిక్యం,  మండల కార్యదర్శి రాములు ఎన్నికైనారు. ఎన్నికైన వారికి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి మోహన్ రెడ్డి వెంకటేశ్వర గౌడ్ ప్రమాణ స్వీకారం చేయించి శాలువా పూలమాలలతోసత్కరించారు. కార్యక్రమంలో మోర్తాడ్ మండల విద్యాశాఖ అధికారి ఎన్. ఆంధ్రయ్య ,ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు తుమ్మల లక్ష్మణ్ పటేల్, బోధన్ డివిజన్ అధ్యక్షులు ఎంబల్లి శంకర్, నిజామాబాద్ డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్ ,రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పెంట జలంధర్ పతాని గంగాధర్, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దేవానందం, కిషన్, అంజాద్, ఎన్నికల నిర్వహణ అధికారి గంట అశోక్ వివిధ రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు.