Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 September 2024, 6:46 pm Posted by : ramakrishna

హోరా హోరిగా సాగుతున్న పీఆర్ టీయు ఎన్నికల ఫోలింగ్

 పీఆర్ టీయు ఎన్నికల ఎకగ్రీవం అశలు గల్లంతు

. . . హోరా హోరిగా సాగుతున్న పీఆర్ టీయు ఎన్నికల ఫోలింగ్

PRTU election folling is going on fastనిజామాబాద్, బతుకమ్మ :                                                                                                                                        

ప్రోగ్రేసీవ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ జిల్లా ఎలక్షన్ జరుగకుండా ఎకగ్రీవం అవుతాయనుకున్న నేతల ఆశలు గల్లంతు అయ్యాయి.  నిజామాబాద్ జిల్లా పీఆర్ టీయు (2024-27) కోత్త కార్యవర్గం ఎన్నికకు ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఓటింగ్ ద్వారనే కోత్త పాలకవర్గంను ఎన్నికకు టీచర్లు మొగ్గు చూపారు. అదివారం జిల్లా కేంద్రంలోని బస్వా గార్డేన్ లో పీఆర్ టీయు జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పోద్ధుటూరి మోహన్ రెడ్డి, వేంకటేశ్వర్ గౌడ్ ల అధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ భట్టాపురం మోహన్ రెడ్డి,పి ఆర్ టి యు మాజీ రాష్ట్ర అధ్యక్షుడుపి వెంకటరెడ్డి, పి ఆర్ టి యు రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కమలాకర్ లు హజరయ్యారు. గత పాలకవర్గంకు సంబంధించిన కార్యదర్శి నివేధిక,అధ్యక్ష ఉపన్యాసం తరువాత మద్యహ్నం తరువాత అందరు ఎన్నికలకు మొగ్గు చూపారు. దానితో నామినేషన్ ల ప్రక్రియ జరిగింది. అధ్యక్షునిగా మోహన్ రెడ్డి,ఎన్ వి కృష్ణారెడ్డి లు పోటి పడుతున్నారు. ప్రధాన కార్యదర్శులుగావెంకటేష్ గౌడ్, జి కిషన్, ఎంబెల్లి శంకర్ లు బరిలో నిలిచారు. జిల్లా అసోసియేట్ అధ్యక్షులుగా హనుమ రెడ్డి, సౌడ సంతోష్, గంట అశోక్, అంకం నరేష్ లు  పోటి చేస్తున్నారు. దానితో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నువ్వా నేనా అన్న మాదిరిగా  ప్రచారం చేసిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవాడానికి అష్ట కష్టాలు పడ్డారు. మండల స్థాయి కార్యవర్గంలోని ఆఫీస్ బేరర్లు 195 మందికి ఓటు హక్కు ఉండగా పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. అదివారం రాత్రి కౌటింగ్ నిర్వహించి , ఫలితాలను ప్రకటించనున్నారు.

PRTU election folling is going on fast