Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 January 2026, 6:16 pm Posted by : ramakrishna

 పిఇటిలకు ప్రొవిజనల్ అడ్వాన్స్మెంట్ టెస్ట్ నిర్వహించాలి

 

 నిజామాబాద్ సీటి, బతుకమ్మ :

యూజీడీ పిఎడ్ తో పిఇటి ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులకు పిఎటి (ప్రొవిజనల్ అడ్వాన్స్మెంట్ టెస్ట్ నిర్వహించాలి) అని పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 150 పి ఈ టి లు (వ్యాయామ ఉపాధ్యాయులు) 12 సంవత్సరాల ఇంక్రిమెంట్ నోచుకొని పరిస్థితి అని అన్నారు. వీరు ఇన్ సర్వీస్ లో ఉండి బిపిఎడ్ పూర్తి చేయకుండానే అదేవిధంగా ప్రభుత్వం గత 15 సంవత్సరాల నుండి ప్రొవిజినల్ అడ్వాన్స్మెంట్ టెస్ట్ నిర్వహించక పోవడం వల్ల పిఇటిలు 12 సంవత్సరాల ఇంక్రిమెంట్ తీసుకోకుండా రిటైర్ అవుతున్నారు. 12 సంవత్సరాల ఇంక్రిమెంట్ కొరకు బిపిఎడ్ లేదా పి ఎ టి టెస్ట్ పాస్ అయి ఉండాలి. కావున ప్రభుత్వం ఇప్పటికైనా ప్రొవిజినల్ అడ్వాన్స్మెంట్ టెస్ట్ నిర్వహించాలని పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.