Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 August 2025, 7:29 pm Posted by : ramakrishna

విద్యార్థులకు యూనిఫాం అందజేత

బతుకమ్మ, భిక్కనూరు : భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి  ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు  కామారెడ్డి బాంబే క్లాత్ యాజమాన్యం యూనిఫామ్ లు  శనివారం పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ అడగగానే కామారెడ్డి బాంబే క్లాత్ యాజమాన్యం స్పందించి విద్యార్థులకు యూనిఫామ్ అందజేయడం సంతోషకరమని అన్నారు. పిల్లలకు అందమైన దుస్తులు, ఇవ్వడంతో పిల్లలు ఎంతో సంతోషించారు. యూనిఫామ్ అందజేసిన బాంబే క్లాత్ యాజమాన్యానికి ఉపాధ్యాయులు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.