Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 January 2026, 9:08 pm Posted by : ramakrishna

బాధితులకు ఎల్ ఓ సీల అందజేత

బాల్కొండ, బతుకమ్మ  :

 

వేర్వేరు ఆనారోగ్య సమస్యల కారణంగా హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితులకు చికిత్స నిమిత్తం మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం హైదరాబాద్ లోని తన నివాసంలో మొత్తం రూ. 3.00 లక్షల విలువైన రెండు ఎల్ ఓ సీలను అందజేశారు. ఇందులో భాగంగా ఏర్గట్ల మండలం గుమ్మిర్యలకు చెందిన మోత్కూరి తనుష్ గౌడ్ కు రూ.2 లక్షల ఎల్ ఓ సీ అందజేయగా, బాల్కొండ కు చెందిన మహమ్మద్ ఫాతే అహ్మద్ కు రూ.1 లక్ష ఎల్ ఓ సీ ని ప్రశాంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు, వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

 

 

Providing LoCs to victims