Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 July 2025, 6:06 pm Posted by : ramakrishna

అనారోగ్య బాధితులకు ఎల్ఓసీ అందజేత

వేల్పూర్, బతుకమ్మ : బాల్కొండ కానిస్టెన్సీలోని భీమ్ గల్, బాల్కొండ మండలాలకు చెందిన ముగ్గురు అనారోగ్య బాధితులకు చికిత్స నిమిత్తం మంగళవారం ఎల్ఓసీ లను మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అందజేశారు. ఎమ్మెల్యే తన వేల్పూర్ నివాస గృహంలో భీమ్ గల్ మండలంలోని బాబాపూర్ కు చెందిన సయ్యద్ పీర్ అహ్మద్ రూ. 2లక్షల ఎల్ ఓ సీ ని, అదే మండలం కారేపల్లికి చెందిన బాధవత్ షీలా కు రూ. 2లక్షల ఎల్ ఓ సీ ని, బాల్కొండ మండలంలోని దూదిగావ్ రూ. 1లక్ష 20వేల ఎల్ ఓ సీ లను ఎమ్మెల్యే అందజేశారు. భాధితుల చికిత్స నిమిత్తం ఏల్ ఓ సీ అందించి ఆదుకొన్నందుకు భాదిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు.

Providing LoC to sick victims