Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 8:24 pm Posted by : ramakrishna

పేద రోగులకు అండగా నిలుస్తూ ఎల్ఓసి పత్రాలు అందజేత

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

పేదలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని అవసరమైన వారికి నిమ్స్ లో ఎల్వోసీ అందజేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం పలువురికి ఎల్ వోసీ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజక వర్గంలో  అర్హులైన పేదలకు ఎల్ వోసీ ఇప్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళుతున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని గాయత్రి నగర్ కు చెందిన పెంటయ్య నరాల సంబంధిత వ్యాధితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అలాగే సబ్బని శ్రీనివాస్ మూత్ర పిండాల సంబంధిత వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కావున ఇరువురికి ఎల్ వోసీ లు అందజేశామన్నారు. పార్టీలకతీతంగా ప్రజల ప్రాణాలను కాపాడటమే తన కర్తవ్యం అని పేర్కొన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రోగికి తక్షణ సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

 

Providing LOC documents to poor patients