రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన మేస్త్రి పోశెట్టి (కుర్మ) ఆకస్మికంగా మృతి చెందడం తో ఆయన కుటుంబానికి మేస్త్రిల సంఘం నాయకులు శనివారం అంత్యక్రియలకు రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించారు. మేస్త్రి యూనియన్ లో కోశాధికారికారిగా పనిచేసి మేస్త్రి యూనియన్ కు ఎనలేని కృషి చేసాడని సంఘం అధ్యక్షులు ముద్దసాని రాజు పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో మేస్త్రి సంఘం నాయకులు బైండ్ల సంజీవ్, సాయిలు, గంగారాం, పిట్ల సుధాకర్, లింగం, పోతారాజు లింగం తదితరులు ఉన్నారు.