Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 July 2025, 9:49 pm Posted by : ramakrishna

ప్రజలకు నాణ్యమైన వైద్యం ను అందించాలి

  • సర్వ సమాజ్ ప్రెసిడెంట్ నీలం రవి

 

భీమ్ గల్, బతుకమ్మ : ప్రభుత్వ ఆసుపత్రి కి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందజేయాలని సర్వసమాజ్ కమిటీ అధ్యక్షులు నీలం రవి కోరారు. సోమవారం స్థానిక ప్రభుత్వ దవాఖాన వైద్యుడు అజయ్ పవర్ ను కలిశారు. ఈ సందర్బంగా ఆసుపత్రి లో వైద్యులతో పాటు సిబ్బంది సమయపాలన పాటించేలా చూడాలని, రోగులకు కావాల్సిన మందులు అందుబాటులో ఉంచాలని కోరారు. అత్యవసర మందులైన పాము కాటు, కుక్క కాటుకు కావాల్సిన మందులు సైతం అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు రోగాల బారిన పడకుండా చర్యాలు చేపట్టాలని, ప్రజలకు హెల్త్ ఎవర్నెస్  ప్రోగ్రాం లు నిర్వహించాలని కోరారు. అనంతరం స్థానిక కస్తూరిభా పాఠశాల కు వెళ్లి విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. పిల్లలకు నాణ్యమైన భోజనం అందజేయాలని సమస్యలు ఉంటే సర్వసమాజ్ దృష్టికి తేవాలని సూచించారు. ప్రభుత్వం ద్వారా డైనింగ్ హాల్ మంజూరైన నేపథ్యంలో త్వరలో నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. పాఠశాల ఆవరణలో గడ్డి తొలగించి, ఆవరణ శుభ్రం చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో సర్వసమాజ్ కమిటీ సభ్యులు బర్ల మోహన్ ఉన్నారు.