నాణ్యమైన భోజనం అందించాలి
నిజామాబాద్, బతుకమ్మ: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, పరిశుభ్ర వాతావరణంలో భోజనం తయారు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఆర్మూర్ మండలం పిప్రి సమీపంలోని ఆర్మూర్, వేల్పూర్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలు, వసతి గృహాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాళ్లను పరిశీలించారు. విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించి, మెనూ ప్రకారం ఉన్నాయా అని తనిఖీ చేశారు. ఆర్మూర్ ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సరఫరా అవుతున్న సన్నబియ్యం నాణ్యతలో...