Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 December 2024, 5:53 pm Posted by : ramakrishna

నాణ్యమైన విద్యను అందించండి

  • జిల్లా విద్యాధికారి అశోక్

నిజామాబాద్, బతుకమ్మ : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా విద్యాధికారి అశోక్ అన్నారు. జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయంలో సోమవారం స్టేట్ టీచర్స్ యూనియన్ డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమస్యల పరిష్కరించడంలో ఎస్టీయూ ముందు ఉంటుంది అని, స్వతంత్రం రాక ముందు ఏర్పడిన సంఘమని తెలిపారు. అనేక సమస్యలను పరిష్కరించి ఉపాధ్యాయుల శ్రేయస్సు కోసం కృషి చేసిన సంఘం అనిఅన్నారు.  తాను ఉపాధ్యాయుని గా ఉన్నపుడు ఎస్టీయూ సభ్యుడినని అని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తుకోసం పాటుపడుతూ,నాణ్యమైన విద్యను అందించే విధంగా కృషిచేయాలని అన్నారు. వచ్చే పదవ తరగతి ఫలితాలలో మన జిల్లా ప్రథమ స్థానంలో ఉండేవిధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ధర్మేందర్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ (వాసు), జిల్లా ఆర్థిక కార్యదర్శి అఫ్జల్ బెగ్, జిల్లా కార్యవర్గ సభ్యులు బాల చంద్రం, రమేష్ మహేశ్వర్, యాదగిరి, కాంతారావు, రత్నాకర్, రవీందర్ గౌడ్, మల్లయ్య, పవన్ కుమార్, గంగాకిషన్, ఆనంద్ ప్రకాష్, హరికృష్ణ, గిరిరాజ్, మక్బూల్ హుస్సేన్, సన ఉద్దీన్, సురేందర్, సాయిబాబా,  శ్రావణ్, ఫజాలుల్ల ఖాన్, వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.