- సబ్ కలెక్టర్ వికాస్ మహాతో
- ఉపాధ్యాయుల బోధన పై అసంతృప్తి వ్యక్తం చేసిన సబ్ కలెక్టర్
రుద్రూర్, బతుకమ్మ : విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన బోధించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం రుద్రూర్ మండలం చిక్కడ్పల్లి గ్రామంలోని మండల పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాలను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు అడుగగా వారు సమాధానం ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయుల బోధనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించినప్పుడే వారు భవిష్యత్తులో ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దబడతారని వివరించారు. అభ్యసన ఫలితాలను మెరుగుపర్చడానికి అవసరమైన పరిష్కార చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. సబ్ కలెక్టర్ వెంట ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.