Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 March 2025, 3:47 pm Posted by : ramakrishna

పేద ప్రజలకు వైద్యం అందించాలి  

  • ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏవోకు వినతి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రజలకు వైద్యం అందించాలని ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఏవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ ఎండ తీవ్రత పెరగడం వల్ల ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని అన్నారు.  మాస్ ఏరియాలలో హెల్త్ క్యాంపు నిర్వహించాలని కోరారు. దొడ్డి కొమురయ్య నగర్  80 క్వార్టర్స్, అంబేద్కర్ కాలనీ, బహుజన కాలనీ లాంటి వార్డులలో ప్రధానంగా ప్రజల చాలా అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు.  ముఖ్యంగా వామ్టింగ్స్, మోషన్స్, జ్వరము, కళ్ళు తిరిగి పడిపోవడం లాంటిది ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. కాబట్టి  ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని  విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అనిత, జిల్లా కమిటీ సభ్యులు వనజ, మాధవి తదితరులు పాల్గొన్నారు.