Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 June 2025, 5:27 pm Posted by : ramakrishna

విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించండి

  • ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్‌ జిల్లా సమితి ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయం లో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారికి అశోక్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల ప్రారంభం అవుతున్న సందర్భంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని అదేవిధంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు మంచినీటి సౌకర్యం, యూనిఫామ్స్, విద్యార్థులకు సరిపడా బాల,బాలికలకు బాత్రూమ్స్, క్లాస్ రూమ్ లో ఫ్యాన్, స్థితుల వ్యవస్థలో ఉన్నటువంటి పాఠశాలకు నూతన భవనం నిర్మించి అదే విధంగా మరమ్మత్తులు చేయించాలని కోరారు. సమస్యలను వెంటనే పరిష్కారం చేసి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంబాద్ జిల్లా అధ్యక్షురాలు అంజలి,జిల్లా సహాయ కార్యదర్శి కుశాల్,నాయకులు మహేష్ పాల్గొన్నారు.