Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 December 2024, 5:07 pm Posted by : ramakrishna

బాధిత కుటుంబానికి తక్షణ సహాయం అందించండి 

  • మొదటి విడితలో ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి 
  • తహసీల్దార్ ను ఆదేశించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి 

భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ మండలం లోని కూన్య తండాలో షార్ట్ షార్కుట్ తో నివాసపు ఇల్లు దగ్ధమైన భూక్య మోతిలాల్ కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తహసీల్దార్ షబ్బీర్ ను ఆదేశించారు. అగ్నిప్రమాద సంఘటన గురించి తెలుసుకొన్న ఎమ్మెల్యే స్పందించి స్వయం మీరే సంఘటన స్థలానికి వెళ్లి భాధితులకు ఆపథబందు ద్వారా నగదు ఆర్థిక సహాయం ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో వారికి మొదటి విడతలో కేటాయించాలని తహసీల్దార్ కు సూచించారు. మా పార్టీ నాయకులు కూడా భాధితులను కలిసి వారి కుటుంబానికి నిత్యావసర వస్తులు, ఇంకా ఇతర అవసరాలను అందజేస్తారని తెలిపారు.

Provide immediate assistance to the affected family