శోభాయాత్ర ప్రారంభంలో ప్రోటోకాల్ రగడ

బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట   నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దశాబ్దాల చరిత్ర కలిగిన గణేష్ నిమజ్జనం శోభాయాత్రకు రాజకీయరంగు పులుముకుంది. ప్రతి ఏటా సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. సార్వజనిక్ కమిటీ కన్వీనర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించడం సాంప్రదాయంగా జరుగుతోంది. ఎమ్మెల్యేలు లేనప్పుడు జిల్లా కలెక్టర్ చేతులు మీదుగా జెండా ఊపి ప్రారంభించడం జరుగుతుంది. గత తొమ్మిది రోజులుగా భక్తిశ్రద్ధలతో జరిగిన...