Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 April 2025, 6:45 pm Posted by : ramakrishna

వక్ఫ్ బోర్డ్ బిల్లును వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన

రుద్రూర్, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డ్ బిల్లును వ్యతిరేకిస్తూ రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్, అక్బర్ నగర్ గ్రామాలల్లో శుక్రవారం ముస్లింలు శాంతియుత నిరసనలు తెలిపారు. నమాజు తర్వాత నల్ల బ్యాడ్జీలు ధరించి   శాంతియుత పద్ధతులలో నిరసన తెలియజేస్తూ మస్జీద్ వద్ద వక్స్ బోర్డ్ బిల్లుకు  వ్యతిరేక నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అక్బర్ నగర్ మజీద్ సదర్ షేక్ మొహమ్మద్ మాట్లాడుతూ.. మైనారిటీల హక్కులకు ముప్పుగా భావించే వక్స్ బోర్డు బిల్లుకు  వ్యతిరేకంగా ఈ నిరసన చేపడుతున్నామని తెలిపారు. ఈ బిల్లు ముస్లింలను మాత్రమే కాకుండా ఇతర మైనారిటీ వర్గాలను కూడా ప్రభావితం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లు వక్స్ బోర్డు స్వయం ప్రతిపత్తిని నాశనం చేస్తుందని, వక్స్ ఆస్తులను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువస్తుందని అన్నారు. ఈ నిర్ణయా పునఃపరిశీలించి బిల్లుని వెనక్కు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వక్స్ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హబీబ్ ఖాన్, అబ్దుల్ రహీం, మన్సూర్, సయ్యద్  సికిందర్ ఖాద్రి,మజీద్ ఇమామ్ హైమద్ రజా, మొహీనుద్దీన్ పాషా, మహబూబ్, హఫీజ్  అఫ్రోజ్ ఖాన్, సమీర్, ఇమ్రాన్,అలీమ్ తదితరులు పాల్గొన్నారు.