Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 May 2025, 6:41 pm Posted by : ramakrishna

రైస్ మిల్ ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన

గాంధారి, బతుకమ్మ : గాంధారి మండల కేంద్రంలో గల ఓం శివా రైస్ మిల్ ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోతి రామ్ నాయక్ మాట్లాడుతూ రామ్ లక్ష్మణ్ పల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యాన్ని తూకం చేసి ఓం శివ రైస్ మిల్ కి ధాన్యం లోడింగ్ ను రైస్ మిల్లర్ యజమాన్యం క్వింటాల్ కు నాలుగు కిలోలు చొప్పున కట్ చేస్తానని అన్నారని తెలిపారు. అయితేనే అన్లోడింగ్ చేసుకుంటాను లేకపోతే లేదు అని మొండి కేసినారని అన్నారు. రైతులు రైతు సంఘాన్ని ఆశ్రయించారని తెలిపారు. రాష్ట్రంలో జిల్లాలో మొత్తం ఇదే పద్ధతులు కొనసాగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాటి నుండి ఏ అధికారి కూడా ఇటువంటి వారిపై చర్యలు తీసుకోకుండా ఎటుబడితే అటు దోచుకుంటారని అన్నారు. ఇప్పటికే ఐదుసార్లు డిపిని, క్రింది అధికారులకు ఎన్ని విధాలుగా విన్నవించిన ఫలితం మాత్రం శూన్యమని తెలిపారు. ఒక్క లోడింగ్ వెనక 25 క్వింటాళ్ల ధాన్యం నష్టమవుతుందని తెలిపారు. ఈ మొత్తాన్ని రైస్ మిల్లర్లు దోచుకుంటున్నారని మండిపడ్డారు. అధికార యంత్రాంగా మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రైతులు ఉన్నారని అన్నారు. ఒక వైపు మద్దతు ధర లేదు మరోవైపు మరో పెట్టుబడి బాగా పెరిగిందన్నిరు. రైతులు పండించిన పంట చేతికి వచ్చేసరికి దళారుల చేతిలో నష్టపోతు ఉంటే ఆత్మహత్యలు పెరగావా అని అన్నారు. దీన్ని రూపుమాపడం కోసం రైతులందరూ ఈనెల 20న గ్రామీణ బంద్ లో పాల్గొనాలని కోరారు. ఈ సమ్మెను విజయవంతం చేయాలని ఎల్లారెడ్డిలో ర్యాలీ నిర్వహిస్తున్నామని రైతులందరూ ఏకాకాలంలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు ప్రకాష్ నాయక్, వసంతరావు నాయక్, దశరథ్, బిచ్చుందా నాయక్, స్వామి తదితరులు పాల్గొన్నారు.