Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 April 2025, 1:44 pm Posted by : ramakrishna

 పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని ఐద్వా ఆధ్వర్యంలో నిరసన

నిజామాబాద్, బతుకమ్మ : పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని ఐద్వా ఆధ్వర్యంలో నగరంలోని నాగారం గోశాల వద్ద నిరసన తెలిపారు.  ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతు  కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.400 ఉన్న గ్యాస్ ధరను దాదాపు రూ. 1100 వరకు పెంచిందన్నారు. ఎన్నికల సమయంలో రూ. 100 తగ్గించి ఇప్పుడు రూ. 50 పెంచడం సరికాదన్నారు. పెంచిన ధరలను తగ్గించకపోతే ఐద్వా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.   ఈ కార్యక్రమంలో ఐద్వా  నాయకులు శ్రీదేవి, రేఖ,  లతా,  సత్యశీల, విమల భాయ్,  లక్ష్మి, రుక్కుంబాయి,  కవిత, భూలక్ష్మి, శాంతాబాయి, తదితరులు పాల్గొన్నారు.