ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి నిరసన సెగ

ఖుద్వంపూర్‌లో నిలదీసిన మహిళలు   నందిపేట్, బతుకమ్మ : ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట్ మండలంలోని ఖుద్వంపూర్ గ్రామంలో మంగళవారం జరిగిన గ్రామ సభ ఎమ్మెల్యేకు  నిరసన చెప్పే వేదికగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గ్రామానికి 10 ఇండ్లు కట్టిస్తానని హామీ ఇచ్చిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆ హామీ నెరవేర్చలేదని గ్రామ మహిళలు మండిపడ్డారు. "మీరు ఎన్నో హామీలు ఇచ్చి గెలిచారు, కానీ ఇప్పటివరకు ఆ హామీలను నెరవేర్చలేదు. మా సమస్యలపై మీ చర్యలు ఏమిటి?" అని ప్రశ్నించారు....