అన్నంలో పురుగులు వస్తున్నాయని నిరసన
ఎల్లారెడ్డి- బాన్సువాడ ప్రధాన రహదారిపై బైఠాయించిన విద్యార్థులు కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు సోమవారం ఎల్లారెడ్డి - బాన్సువాడ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ... గిరిజన పాఠశాలలో అన్నం తినేటప్పుడు తరచుగా పురుగులు వస్తున్నాయని ఈ విషయంపై పలుమార్లు ప్రిన్సిపల్, అధ్యాపకుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోవడంలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పని పరిస్థితుల్లో రోడ్డుపై బైఠాయించిన నిరసన వ్యక్తం...