నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మోడీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్కేఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ కమిటీ పిలుపు మేరకు బి భాస్కర్, ఎస్కేయం రాష్ట్ర కన్వీనర్ అధ్యక్షతన నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్కేఎం రాష్ట్ర నాయకులు ఆకుల పాపయ్య, పి రామకృష్ణ, కంజర భూమయ్య మాట్లాడారు. మోడీ సర్కార్ భారత దేశ వ్యవసాయాన్ని పెట్టుబారిదారులైన దోపిడీదారులకు అప్ప చెప్పడానికి కోసం అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తుందన్నారు. గతంలో మూడు నల్ల చట్టాలను తీసుకువచ్చి ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో 750 మంది రైతులు తమ ప్రాణాలను కోల్పోయిన మోడీ సర్కార్ పట్టించుకోలేదని అన్నారు. రైతు ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన స్పందనతో మోడీ సర్కార్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి మూడు నల్ల చట్టాలను రద్దు చేసిందని తెలిపారు. కానీ తాను మేక వన్న పులిలా అదాని, అంబానీలకు ఎట్లాగైనా భారత దేశ వ్యవసాయ మార్కెట్ను అప్పజెప్పడానికి దొడ్డిదారిన నూతన వ్యవసాయ మార్కెట్ విధానం పేరుతోనే మళ్లీ కుట్టలు కుతంత్రాలు చేస్తుందన్నారు. గత ఉద్యమంలో రాతపూర్వకంగా ఇచ్చిన హామీని అమలు చేయాలని, విద్యుత్సాహరణ బిల్లును రద్దు చేయాలని డాక్టర్ సామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు ఎంఎస్పి మద్దతు ధరను పార్లమెంటులో బిల్లుగా ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా కార్మిక వర్గంతోని ప్రజలతో కలుపుకొని ఉద్యమం తీసుకువస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్లు ఎస్.సురేష్, బి.గంగారెడ్డి, వేల్పూర్ భూమయ్య, అడ్డికే రాజేశ్వర్, వివిధ రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాల, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.