మిర్చీ దండ మెడలో వేసుకుని నిరసన

హైదరాబాద్, బతుకమ్మ: మిర్చ పంటకు రూ.25వేల గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శాసన మండలి ఆవరణలో వినూత్నంగా నిరసన తెలిపారు. మెడల్లో మిర్చీ దండలు వేసుకుని ప్ల కార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత సీజన్ లో 4లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగుకాగా, ధర లేకపోవడంతో ఈ సీజన్ లో సాగు విస్తీర్ణం 2లక్షల 40వేల ఎకరాలకు తగ్గిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి నాఫెడ్, మార్క్...