పోలీస్ వాహనానికి మృతదేహాన్ని కట్టి నిరసన
మోర్తాడ్, బతుకమ్మ : యువకుడి మృతదేహాన్ని పోలీస్ వాహనానికి కట్టేసి నిరసనకు దిగిన ఘటన నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. దోంచందా గ్రామానికి చెందిన నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి (29) ప్రేమించి మోసపోయానని మనస్తాపంతో నవంబర్ 6న విషం తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స కోసం హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. దీంతో ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతోనే శ్రీకాంత్ చనిపోయాడని బంధువులు అతడి మృతదేహంతో...